AP: 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు | AP Assembly Session To Start From November 11 | Sakshi
Sakshi News home page

AP: 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Nov 5 2024 4:34 AM | Updated on Nov 5 2024 10:13 AM

AP Assembly Session To Start From November 11

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11నుంచి జరగనున్నాయి. 11న ఉద­యం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశమవుతాయని శాసన వ్యవహా­రాల కార్యదర్శి సోమవారం రెండు నోటిఫి­కేషన్లు జారీ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటినా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదు. 2024–25 సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టింది.

జూన్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను పొడిగిస్తూ ఆర్డి­నెన్స్‌ ఇచ్చింది. దాని గడువు నవంబర్‌తో ముగుస్తుండటంతో అనివార్యంగా ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో మిగతా నాలుగు నెలలే మిగిలి ఉండటంతో ఆ కాలా­నికే పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.  10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. 

ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement