
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ రద్దు అయ్యింది. ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ బుధవారం మధ్యాహ్నాం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
వాస్తవానికి 15వ శాసనసభ గడువు జూన్ 16వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఫలితాలు వెలువడడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న అసెంబ్లీని రద్దు చేయాల్సి రావడం అనివార్యమైంది.
