
సాక్షి, అనంతపురం: నిర్భయ కేసు నమోదైన జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషాపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా వ్యవసాయశాఖ జేడీ పదవి నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మహిళా ఉద్యోగి సల్మా జేడీ హబీబ్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హబీబ్ సెలవుల్లో ఉన్నారు. గతంలో ఆయన గుంటూరులో డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సమయంలోనూ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. (అంబులెన్స్ .. మృతదేహమైతే లక్ష డిమాండ్)