breaking news
joint director of agriculture
-
నిర్భయ కేసు: వ్యవసాయ శాఖ జేడీ సస్పెండ్
సాక్షి, అనంతపురం: నిర్భయ కేసు నమోదైన జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషాపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా వ్యవసాయశాఖ జేడీ పదవి నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మహిళా ఉద్యోగి సల్మా జేడీ హబీబ్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హబీబ్ సెలవుల్లో ఉన్నారు. గతంలో ఆయన గుంటూరులో డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సమయంలోనూ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. (అంబులెన్స్ .. మృతదేహమైతే లక్ష డిమాండ్) (అగ్రికల్చర్ జేడీ హబీబ్ బాషాపై నిర్భయ కేసు) -
నేడు జేడీతో 'ఫోన్ ఇన్'
అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, పెసర ఖరీఫ్ పంటలకు ఆశించిన చీడపీడలు, తెగుళ్లు, వాటి నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు, అలాగే ప్రత్యామ్నాయ పంటల సాగు ఏవైనా సమస్యలుంటే గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య 08554–246847 నెంబర్‌కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు పొందాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి రైతులకు సూచించారు. ఫోన్‌ఇన్ కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువుల వాడకం, భూసార పరీక్షల ఫలితాల పత్రాలు, వర్షాల స్థితిగతులు, పంటలకు వ్యాపించిన తెగుళ్లు, నివారణ పద్ధతుల గురించి సరైన సలహాలు పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి గురువారం రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.