11 మందితో ఏఎంఆర్‌డీఏ | AMRDA with 11 people | Sakshi
Sakshi News home page

11 మందితో ఏఎంఆర్‌డీఏ

Aug 3 2020 4:02 AM | Updated on Aug 3 2020 9:30 AM

AMRDA with 11 people - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీసీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసింది. చైర్‌పర్సన్‌గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమిస్తూ తరువాత ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇప్పటి వరకు ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహంను ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమిస్తూ శ్యామలరావు మరో జీవో జారీ చేశారు. 

ఏఎంఆర్‌డీఏలో సభ్యులు..
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి – డిప్యూటీ చైర్‌పర్సన్‌    
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి – సభ్యుడు    
ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ –సభ్య కన్వీనర్‌
గుంటూరు జిల్లా కలెక్టర్‌ –సభ్యుడు    
కృష్ణా జిల్లా కలెక్టర్‌ – సభ్యుడు
టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ –సభ్యుడు    
రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ –సభ్యుడు    
ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ –సభ్యుడు
ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ –సభ్యుడు
రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (గుంటూరు) –సభ్యుడు
రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (విజయవాడ) –సభ్యుడు

Advertisement
 
Advertisement
Advertisement