భక్తుడికి పోర్న్‌ లింక్‌: ఐదుగురిపై వేటు

Absence Video Link Case TTD Fires 5 Employees - Sakshi

సాక్షి, తిరుపతి : భక్తుడికి పోర్న్‌ వీడియో లింక్‌ పంపిన కేసుకు సంబంధించి ఐదుగురు శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానల్‌ ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకుంది. ఆ ఐదుగురిని ఉద్యోగంలోంచి తొలగించింది. వారితో పాటు మరో నలుగురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక మేరకు టీటీడీ చర్యలు తీసుకుంది.  కాగా, కొద్దిరోజుల క్రితం శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీ ఛానెల్‌కు ఓ భక్తుడు మెయిల్ చేశాడు. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలకు బదులు పొరపాటున అశ్లీల వెబ్‌సైట్ లింక్‌ను పంపించాడు ఓ ఎస్వీబీసీ ఉద్యోగి. సదరు భక్తుడు దీనిపై టీటీడీ చైర్మన్, ఈఓకి ఫిర్యాదు చేశాడు.

ఘటనపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డి.. ఎస్వీబీసీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడీపీ అధికార్లు ఎస్వీబీసీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పోర్న్ సైట్ వీడియో పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో అశ్లీల వీడియోలు చూస్తున్న మరో 5 గురు ఉద్యోగులను గుర్తించారు. విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని కూడా గుర్తించి వారిపై చర్యలకు సిద్ధమయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top