ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,266 కోట్లు | 7266 crores for construction of national highways in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,266 కోట్లు

Aug 8 2024 6:40 AM | Updated on Aug 8 2024 9:48 AM

7266 crores for construction of national highways in AP

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ  ప్రతిపాదన మేరకే.. 

2024–25 వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో జాతీయ రహదా­రులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024–25 వార్షిక ప్రణాళికను ఆమోదించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన మేరకే కేంద్ర జాతీ­య రహదారుల అభి­వృద్ధి శాఖ ఆమోద­ముద్ర వేసింది. ఆ మేరకు 2023 డిసెంబర్‌లోనే ప్రతి­పాదనలు పంపింది. కీలకమైన విజయ­వాడ తూర్పు బైపాస్‌తోసహా పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


2024–25 వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన ప్రాజెక్టులు ఇవీ..
⇒ కృష్ణా జిల్లా రామారావు పేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ వరకు నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్‌ నిర్మాణానికి రూ.2,716 కోట్లు. 
⇒ వినుకొండ – గుంటూరు నాలుగు లేన్ల రహదారికి రూ.2,360కోట్లు
⇒అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్‌ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.906 కోట్లు
⇒ విజయవాడలోని మహానాడు జంక్షన్‌ నుంచి నిడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.669కోట్లు
⇒ చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిపై రణస్థలం వద్ద విడిచిపెట్టిన ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని  పూర్తిచేసేందుకు రూ.325కోట్లు
⇒ గన్నవరం సమీపంలోని గుండు­గొలను ‘గామన్‌ జంక్షన్‌’ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ.150కోట్లు
⇒ జాతీయ రహదారి 44పై 416 కి.మీ. వద్ద అసంపూర్తిగా ఉన్న నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసేందుకు రూ.140 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement