సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2024 నుంచి ఇప్పటి వరకూ పాము కాట్లతో 60 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. గడచిన మూడేళ్లలో దాదాపు 4,800 పాము కాటు ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 19 నుంచి 25 వరకు అంతర్జాతీయ పాముకాటు అవగాహన దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌లను మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ప్రభుత్వాస్పత్రులతో పాటు, 108 అంబులెన్స్‌ల్లోను పాముకాటు విరుగుడు మందు అందుబాటులో ఉందన్నారు. పాము కాట్లతో 2024లో 41 మంది, గతేడాది 13 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకూ ఆరుగురు మరణించారన్నారు.


