
తాజాగా 61,112 మందికి పరీక్షలు చేయగా.. 3,224 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,504 వైరస్ బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 7,08,712 కు చేరింది. ఇక కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకెళ్తోంది. తాజాగా 61,112 మందికి పరీక్షలు చేయగా.. 3,224 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,58,951 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 43,983 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో కొత్తగా 32 మంది ప్రాణాలు విడువడంతో.. ఆ మొత్తం సంఖ్య 6256 కు చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా పరీక్షల్లో 36,702 ట్రూనాట్ పద్ధతిలో, 24,410 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశామని వెల్లడించింది. ఇప్పటివరకు 66,30,728 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది.
(చదవండి: బతకలేం, తిరిగి పనిలోకి వచ్చేస్తాం)