AP: ఆర్టీసీ ఉద్యోగులకు సకల సౌకర్యాలు  | 18 RTC Unions Meeting With AP Transport CS MT Krishna Babu | Sakshi
Sakshi News home page

AP: ఆర్టీసీ ఉద్యోగులకు సకల సౌకర్యాలు 

Aug 17 2021 8:08 AM | Updated on Aug 17 2021 8:09 AM

18 RTC Unions Meeting With AP Transport CS MT Krishna Babu - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు  సకల సౌకర్యాలు కల్పించే విషయమై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ సీహెచ్‌. ద్వారకా తిరుమలరావు ఆరీ్టసీకి చెందిన 18 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో విజయవాడలో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించే పింఛన్, ఎస్‌బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్, మెడికల్‌ ఇన్వాలిడేషన్, చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు మొదలైన అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ఆ అన్ని అంశాలపై ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ప్రభుత్వం త్వరలోనే తగిన విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో 2020 జనవరి నుంచి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వివిధ సదుపాయాలు కలి్పస్తూ ఉత్తర్వులిస్తామన్నారు. డిపోస్థాయిల్లోని సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, రీజనల్‌ మేనేజర్లు, డిపో మేనేజర్లకు తగిన ఆదేశాలిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement