ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

13 IPS Officers Transferred In Andhra Pradesh By AP Govt - Sakshi

సాక్షి, అవరావతి: ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో రాజమండ్రి అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి , విజిలెన్స్‌&ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (జనరల్ అడ్మిన్‌) ఎస్పీగా డా.షీమోషి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీగా కోయా ప్రవీణ్‌.. దీంతో పాటు పీటీవోగా ఆయన అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు.

ఇక విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్‌, డీజీపీ ఆఫీస్‌లో లాండ్‌ ఆర్డర్ ఏఐజీగా అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్‌, విజయవాడ రైల్వేస్‌ ఎస్పీగా రాహుల్‌దేవ్‌ సింగ్‌, మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా అజిత వేజెండ్ల, కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా జీఎస్ సునీల్‌, విశాఖ డీసీపీ-1గా గౌతమి శాలి , ఇంటెలిజెన్స్‌ సీఎం ఎస్‌జీ ఎస్పీగా వకుల్ జిందాల్‌లు బదిలీ అయ్యారు. ఇక నారాయణ్‌ నాయక్‌కు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top