
అనకాపల్లి: మాడుగుల మోదకొండమ్మ ఆలయం సమీపంలో తుమ్మగంటి వారి పంట పొలాల వద్ద 12 అడుగుల గిరినాగును పట్టుకున్నారు. శుక్రవారం గిరినాగును చూసి బెంబేలెత్తిన స్థానికులు మాడుగుల మోదమాంబ కాలనీకి చెందిన స్నేక్ కేచర్ పెచ్చెట్టి వెంకటేశ్‌కు సమాచారమిచ్చారు.
ఆయన చాకచక్యంగా పామును పట్టుకొని మాడుగుల శివారు రామచంద్రపురం గ్రామంలో గల అడవుల్లో వదిలిపెట్టారు. గిరినాగు వల్ల ఎటువంటి హాని కలగదని ప్రజలకు వివరించారు.