breaking news
girinagu
-
బుసలు కొట్టిన 12 అడుగుల గిరినాగు..!
అనకాపల్లి: మాడుగుల మోదకొండమ్మ ఆలయం సమీపంలో తుమ్మగంటి వారి పంట పొలాల వద్ద 12 అడుగుల గిరినాగును పట్టుకున్నారు. శుక్రవారం గిరినాగును చూసి బెంబేలెత్తిన స్థానికులు మాడుగుల మోదమాంబ కాలనీకి చెందిన స్నేక్ కేచర్ పెచ్చెట్టి వెంకటేశ్‌కు సమాచారమిచ్చారు. ఆయన చాకచక్యంగా పామును పట్టుకొని మాడుగుల శివారు రామచంద్రపురం గ్రామంలో గల అడవుల్లో వదిలిపెట్టారు. గిరినాగు వల్ల ఎటువంటి హాని కలగదని ప్రజలకు వివరించారు. -
హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు
మోతుగూడెం: తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం ఏపీ జెన్కో ఫిల్టర్ హౌస్ వద్ద 14 అడుగుల గిరినాగు స్థానికులను బుధవారం హడలెత్తించింది. మంచినీటి ట్యాంక్ వద్ద రెండు రోజుల నుంచి పాము సంచరించడాన్ని జెన్కో ఉద్యోగులు గమనించి వన్యప్రాణి విభాగానికి సమాచారమిచ్చారు. వారు నలుగురు స్నేక్ హెల్పర్స్ బృందాన్ని పంపారు. వారు పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పాముని అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని అటవీ శాఖ సిబ్బంది చెప్పారు. చదవండి: పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు..ఎందుకో తెలుసా? బంగారు టీషర్ట్! చూశారా..? -
గిరినాగే.. ఇలవేల్పు
పూజలు చేస్తున్న గిరిజన మహిళ రాజవొమ్మంగి మండలం లాగరాయి శివారున సంఘటన రాజవొమ్మంగి : సాధారణంగా గిరినాగు (కింగ్‌కోబ్రా) ఉందంటే చాలామంది భయంతో వణికిపోతారు. ఆ చుట్టుపక్కలకు వెళ్లేందుకే భయపడతారు. 20 మీటర్ల ఎత్తువరకూ పైకి లేచి ఒకేసారి 10, 15 మందిపై దాడి చేసే గిరినాగు గురించి మాట్లాడుకోవడానికే ధైర్యం చాలదు. అలాంటిది ఓ గిరిజన మహిళ తన పూరి గుడిసెలో ఇరుకుగా, చీకటిగా ఉన్న ఓ గదిలోకి ప్రవేశించిన గిరినాగును నాలుగు రోజులుగా పూజిస్తున్న విషయం ఆదివారం వెలుగు చూసింది. ఆరేళ్లుగా నాగదేవత కనిపిస్తుందని.. రాజవొమ్మంగి మండలం లాగరాయి శివారున ఉన్న జీడిమామిడి తోటలో పూసం సత్యవతి, అబ్బాయిదొర దంపతులు తమ ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. ఏటా ఉగాదికి ముందు తొమ్మిది రోజులపాటు తమ తోటలో ఉంటే పోశమ్మ గుడి వద్ద వసంత రాత్రులు అనే పండగ జరుపుతుంటారు. చివరి రోజున భారీ అన్నసంతర్పణ నిర్వహిస్తారు. పండగ రోజుల్లో ఏదో ఒక రోజు గుడి వద్ద లేదా ఇంట్లో నాగదేవత కనిపించడం ఆరేళ్లుగా జరుగుతుంది. అయితే శుక్రవారం దాదాపు ఎనిమిది మీటర్ల పొడవు మూడు అంగుళాల మందం ఉన్న భారీ సర్పం అందరూ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసింది. అదే గదిలో ప్రతిరోజూ సత్యవతి పూజలు నిర్వహించే పూజా మందిరం ఉంది. ఆ పామును చూసి మొదట భయానికి గురైన కుటుంబసభ్యులు, ఏటా వచ్చే నాగదేవత ఈ భారీ నాగదేవత ఒకటే అని తెలుసుకుని తమ భయాన్ని విడిచి పెట్టారు. నాలుగు రోజులుగా భారీ సర్పం పూజ మందిరంలో ఉండగానే పూజలు నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన చుట్టు పక్కల వారు అధిక సంఖ్యలో ఆ ఇంటికి వచ్చి సర్పరాజుని దర్శించుకుంటున్నారు.