
కరోనా నుంచి కోలుకున్న సీతారామమ్మ
సారవకోట: ఆత్మస్థైర్యంతో ఉంటే ఎలాంటి సమస్య ఎదురైనా బయటపడవచ్చని నిరూపించారు ఓ వందేళ్ల వృద్ధురాలు. కరోనా మహమ్మారి సోకినా భయపడకుండా వైద్యుల సలహాలు పాటిస్తూ సురక్షితంగా కోలుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన 100 ఏళ్ల బామ్మ యాళ్ల సీతారామమ్మకు ఏప్రిల్ 20న కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆమెను కుటుంబ సభ్యులు హోం ఐసొలేషన్‌లో ఉంచారు. సకాలంలో మందులు వేసుకుంటూ, వైద్యుల సలహాలు పాటించడంతో ఆమె కోలుకున్నారు.
ఆహారం ఇలా...
♦ఉదయం నిమ్మరసంతో కూడిన తేనె, గుడ్డు అల్పాహారంలో ఇడ్లీ, అట్లు, పూరీలు వంటివి
♦రెండు గంటల విరామం తర్వాత మజ్జిగ
♦మధ్యాహ్న భోజనంలో చికెన్, చేపలు, గుడ్లతో పాటు అన్నం. సాయంత్రం బొప్పాయి, యాపిల్
♦రాత్రి భోజనంలో కాకరకాయ బెల్లం కూర, గుడ్డు, ఇతర కూరగాయలతో అన్నం.
♦పడుకునే ముందు ఎండు ద్రాక్ష
♦మొదటి నుంచి అలవాటు ప్రకారం నీరు ఎక్కువగా తాగానని సీతారామమ్మ చెప్పారు.
మందులు..
ప్రభుత్వం అందించిన హోం ఐసొలేషన్ కిట్‌తో పాటు వైద్యుల సలహా మేరకు కొన్ని మందుల్ని వినియోగించారు. ఈమె మనవడు యాళ్ల భూషణరావు స్థానిక పీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తుండటంతో ఈమె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఈమె ఆక్సిజన్ స్థాయి 97 నుంచి 98 వరకు ఉంది.
చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’
కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు