కాపలాదారులుగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కాపలాదారులుగా ఉంటాం

Nov 24 2026 12:42 AM | Updated on Nov 24 2026 12:42 AM

● నగరంలో అక్రమాలను అడ్డుకుంటాం

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

● నూతన ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం

అనంతపురం: ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరానికి కాపలాదారులుగా ఉంటూ ప్రజాసేవ చేస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. కూటమి నేతల అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని చెప్పారు. నగరపాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌తో పాటు 21 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముందుగా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన పాలకవర్గానికి అనంత అభినందనలు తెలిపి, భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇచ్చి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టిన నగర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి అనంతపురంలో ప్రశాంతత కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, సామాన్య జనం భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.

అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అనంతపురం నగర రూపురేఖలు మారుస్తూ రూ.1,200 కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని అనంత గుర్తు చేశారు. కౌన్సిల్‌లో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల పరిష్కారంలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తూనే, ఎవరు అన్యాయంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అవిశ్రాంత కృషి వల్లే ఈ చరిత్రాత్మక విజయం సాధ్యమైందని అభినందించారు. మేయర్‌ రమేష్‌ గౌడ్‌ నాయకత్వంలో కార్పొరేటర్లందరూ అందుబాటులో ఉంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్మే వై.విశ్వేశ్వరరెడ్డి, పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, నదీం అహమ్మద్‌, ఎస్‌ఈసీ సభ్యులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ పరిశీలకులు బోయ తిప్పేస్వామి పాల్గొన్నారు. ఇంకా వైఎస్సార్‌సీపీ నాయకులు వైవీ శివారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, మాజీ మేయర్‌ వసీం సలీం, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, మాజీ రాష్ట్ర ఇరిగేషన్‌ చైర్మన్‌ నల్లపరెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎగ్గుల శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, గౌని నాగన్న, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, టీటీడీ మాజీ సభ్యులు అశ్వత్థనాయక్‌, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్‌ సైఫుల్లా బేగ్‌, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కొండ్రెడ్డి గారి ఓబిరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, గోగుల పుల్లయ్య, న్యాయవాది నీరజ, భారతి, రంగంపేట గోపాల్‌రెడ్డి, రాధాయాదవ్‌, అనిల్‌కుమార్‌ గౌడ్‌, నూతన కార్పొరేటర్లు దాసరి కృష్ణమూర్తి, కోగటం శ్రీదేవి, బయపరెడ్డి గారి రాధ, సి.సుఖేష్‌, చింతకుంట నాగ వినీత, గోవిందరెడ్డి ఐశ్వర్య, సి.రామలక్ష్మి, దేవరకొండ సులోచన, మడకశిర కృష్ణ నవ్య, కొండ్రెడ్డి గారి భారతి, వెన్నం శివరామిరెడ్డి, తలారి జ్ఞానేశ్వర్‌, వి.బలరాం, కనుముక్కల సందీప్‌ కుమార్‌, సాకే చంద్రశేఖర్‌, సిద్దవటం నిహార్‌రెడ్డి, కొమ్మా అనిల్‌కుమార్‌రెడ్డి, షేక్‌ ఖాజా వలి, గంగిరెడ్డి గారి శ్రీనివాసరెడ్డి, షేక్‌ అఫ్రియ, బిందు ప్రియ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement