ఆగని జేసీ అనుచరుల ఆగడాలు | - | Sakshi
Sakshi News home page

ఆగని జేసీ అనుచరుల ఆగడాలు

Nov 24 2026 12:42 AM | Updated on Nov 24 2026 12:42 AM

తాడిపత్రిటౌన్‌: దిగువపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలు విజయలక్ష్మీకి చెందిన బొలెరో వాహనానికి ఆదివారం రాత్రి నిప్పు పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో నామినేషన్‌ వేసేందుకు ఆమె సిద్ధం కాగా.. భయభ్రాంతులకు గురి చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. అయినా ఆమె భయపడకుండా సోమవారం సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే తాడిపత్రి మండలం ఉస్సేనాపురం గ్రామానికి చెందిన తలారి నాగరాజు తన ఆటోలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కళ్యాణితో నామినేషన్‌ వేయించేందుకు తాడిపత్రిలోని కర్నూలు వెంచర్‌ సచివాలయానికి రాగానే అక్కడే కాపు కాచిన టీడీపీ గూండాలు నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించేశారు. ఆటోను రాళ్లతో ధ్వంసం చేశారు. పెద్దపప్పూరు మండలం చాగల్లుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత సూర్యనారాయణ మండల కేంద్రంలో నామినేషన్‌ వేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కాపు కాసిన ‘పచ్చ’ మూకలు ఆయన వద్ద ఉన్న నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించేశారు. అమ్మలదిన్నె లో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన ముచ్చుకోట పంచాయతీ వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకుని..పెద్దపప్పూరు స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement