పంచాయతీ పోరులో టీడీపీ బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ పోరులో టీడీపీ బరితెగింపు

Nov 24 2026 12:42 AM | Updated on Nov 24 2026 12:42 AM

● పోటీ లేకుండా చేసుకునేందుకు టీడీపీ పాట్లు

అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులతో పాటు ఇతరులు ఎవ్వరూ పోటీలో ఉండకుండా ఇబ్బందులు పెట్టి ఆయా స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు.

రాచేపల్లిలో ఒత్తిడి చేసి..

పోటీ నుంచి తప్పించి..

శింగనమల మండలం రాచేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ పంచాయతీ పరిధిలోని అలంకరాయునిపేట నుంచి శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు స్వగ్రామం అలంకరాయునిపేట రాచేపల్లి పంచాయతీలో ఉంది. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ రాజు భార్య ఉమ టీడీపీ మద్దతుదారుగా సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరు మద్దతుదారులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి యాస్మిన్‌, మరొకరు నామినేషన్‌ వేశారు. స్క్రూటినీ సమయంలో ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వారిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు ఆది భార్య నాగలక్ష్మిని టీడీపీ నేతలు పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేశారు. ఇక ఉమకు పోటీగా యాస్మిన్‌ మాత్రమే బరిలో ఉన్నారు. ఉపసంహరణకు మంగళ వారం చివరి రోజు కావడంతో.. ఆమెను విత్‌డ్రా చేయించి.. సర్పంచ్‌ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

యాడికిలో అభ్యర్థులకు బెదిరింపులు

యాడికి: మండలంలోని యాడికి, నగరూరు, గుడిపాడు పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సర్పంచ్‌, వార్డు స్థానాలకు నామినేషన్‌ వేయకుండా టీడీపీ నాయకులు రాత్రి వేళల్లో వారి ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయాన్ని సీఐ దృష్టికి తీసుకెళ్లి రక్షణ కల్పించాలని కోరినా పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు.

సర్పంచ్‌ అభ్యర్థి కిడ్నాప్‌

విడపనకల్లు: వేల్పుమడుగు పంచాయతీ సర్పంచ్‌ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారు నామినేషన్‌ వేయకుండా ఏకంగా పోలీసుల ద్వారా కిడ్నాప్‌ చేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సర్పంచ్‌ స్థానం జనరల్‌కు రిజర్వు అయ్యింది. టీడీపీ నేతలు తమ మద్దతుదారును సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసుకునేందుకు గ్రామంలో ఇరువర్గాలతో మంతనాలు చేశారు. ఇందుకు కొందరు అంగీకరించగా.. మరికొందరు తిరస్కరించారు. ఈ క్రమంలో చివరి రోజైన సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో నామినేషన్‌ వేసేందుకు పత్రాలు సిద్ధం చేసుకుని విడపనకల్లు నుంచి వేల్పుమడుగుకు వెళ్తున్న బోయ శ్రీరాములును మార్గమధ్యంలో ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌ సిబ్బందితో వెళ్లి అడ్డుకున్నారు. ‘పై నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. నువ్వు నామినేషన్‌ వేయకూడదు’ అంటూ బెదిరిస్తూ పోలీస్‌ జీపులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement