మాటలతో రెచ్చగొట్టి.. కర్రలతో కొట్టుకుని.. | - | Sakshi
Sakshi News home page

మాటలతో రెచ్చగొట్టి.. కర్రలతో కొట్టుకుని..

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

● రాయలచెరువులో ఉద్రిక్తత

యాడికి: రాయలచెరువు గ్రామంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పుప్పాల గ్రామ పంచాయతీలో ఎక్కువగా గొల్ల సామాజికవర్గం వారు ఉన్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌, ఎనిమిది వార్డు స్థానాలకు తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ మద్దతుతో పలువురు అభ్యర్థులు బరిలో దిగారు. ఇందులో భాగంగా ఆదివారం నామినేషన్‌ వేసేందుకు రాయలచెరువులోని కేంద్రానికి ఇరువర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో రాయలచెరువు ఎస్సీ కాలనీ వద్ద ఓ వర్గం వారు.. మరొక వర్గం వారిని మాటలతో రెచ్చగొట్టారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుంటూ చివరకు కట్టెలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త గంపరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యర్థి వర్గంలోనూ ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement