అనంతపురం అర్బన్: ఏపీ జేఏసీ అమరావతి విభాగాల బలోపేతంతోపాటు ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దామని రెవెన్యూ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎన్ దివాకర్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక రెవెన్యూ హోమ్‌లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం సమావేశం నిర్వహించారు. దివాకర్‌రావు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, ఇళ్ల స్థలాలు, ప్రమాదాలు, ఆర్థిక సహాయం, ఆరోగ్య బీమా, వైద్య శిబిరాలు, రెవెన్యూ డైరీ–2027 ప్రకటనల సేకరణ, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సంఘం కోఆప్షన్ ఉపాధ్యక్షుడిగా వెంకటరామిరెడ్డి, ఈసీ సభ్యుడిగా దినేష్‌ను ఎంపిక చేశారు. సమావేశంలో సంఘం కార్యదర్శి సోమశేఖర్, కోశాధికారి పునీత్‌బాబు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు హరిప్రసాద్, కార్యదర్శి భరత్‌కుమార్, కోశాధికారి శ్రీలక్ష్మి, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్ డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, శ్యాంరాయ్, రాజ్‌కుమార్, క్రీడలు, సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు సంజీవరెడ్డి, కార్యదర్శి హరిప్రసాద్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.


