ఘనంగా బాబయ్య స్వామి ఉరుసు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బాబయ్య స్వామి ఉరుసు

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

పెనుకొండ రూరల్‌: దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన బాబయ్య స్వామి 754 గంధం వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం రాత్రి ఒంటి గంట నుంచి పెద్ద గంధం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పీఠాధిపతి నజీర్‌ హుస్సేన్‌ ఇంటి నుంచి పకీర్ల విన్యాసాల మధ్య గంధాన్ని తీసుకొచ్చి బాబయ్య సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి గంధం, ఉరుసుకు హాజరైన భక్తులు బాబయ్య సమాధిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ దుకాణాలు, ఎగ్జిబిషన్‌ భక్తులతో కిటకిటలాడాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement