ఆత్మకూరు: మండల పరిధిలోని పంపనూరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. ముందుగా స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి స్వర్ణముఖ కవచంతో ఆలయం చుట్టూ పల్లకీ సేవ చేయించారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక టెంట్లు వేయించారు. కాలసర్పదోష నివారణ రాహుకేతు హోమాలు నిర్వహించారు. మంజునాథ స్వామి, పార్వతి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని అనంతపురం, కళ్యాణదుర్గం, ఆత్మకూరు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


