గ్రామ ముంగిట్లోకి ఉచిత న్యాయ సేవలు | - | Sakshi
Sakshi News home page

గ్రామ ముంగిట్లోకి ఉచిత న్యాయ సేవలు

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

అనంతపురం : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, మహిళలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు ఇంటి వద్దకే ఉచిత న్యాయ సహాయాన్ని అందించే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వినూత్న అడుగు వేసింది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద కూడేరు మండలం మరుట్ల గ్రామంలోని 2వ కాలనీలో గ్రామీణ ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.రాజశేఖర్‌ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామ ప్రజలకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా.. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ కేంద్రంలో ఉండే న్యాయవాది లేదా పారాలీగల్‌ వలంటీర్‌కు తెల్లకాగితంపై రాసి ఇచ్చినా లేదా మౌఖికంగా చెప్పినా నమోదు చేసుకుని ఉచితంగా న్యాయవాదిని సమకూరుస్తారని భరోసా ఇచ్చారు. అలాగే డిసెంబర్‌ 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, న్యాయవాదులు, పారాలీగల్‌ వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరుట్లలో పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement