● నోటిఫికేషన్ విడుదల
● డిసెంబర్ 21లోపు
దరఖాస్తులకు ఆహ్వానం
అనంతపురం : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం (జేఎన్టీయూ–ఏ) 16వ స్నాతకోత్సవం 2027 జనవరిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కాన్వొకేషన్ డిగ్రీ కోసం ఆన్‌లైన్ [ https:// jntuaebranchpayment. in/ originaldegree] (https:// jntuaebranchpayment. in/ originaldegree) లో వచ్చే నెల (డిసెంబర్) 21లోపు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ సూచించారు. స్నాతకోత్సవ వేదికపై కేవలం పీహెచ్‌డీ అవార్డు గ్రహీతలు, గోల్డ్ మెడల్ విజేతలకు మాత్రమే నేరుగా పట్టాలను ప్రదానం చేయనున్నారు. మిగిలిన అభ్యర్థులందరికీ రిజిస్టర్డ్ పోస్ట్, కొరియర్ ద్వారా వారి ఒరిజినల్ డిగ్రీలను పంపనున్నారు. స్నాతకోత్సవానికి సంబంధించిన పూర్తి నియమ నిబంధనలు, ఇతర వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.jntua.ac.inలోని ఎగ్జామినేషన్ విభాగాన్ని సందర్శించాలని కోరారు.
జాతీయస్థాయి క్రీడా పోటీలకు
ఆవులదట్ల విద్యార్థిని
రాయదుర్గం రూరల్: ఆవులదట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బి.నేత్ర జాతీయస్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికై నట్లు పీడీ శివశరణ్ బుధవారం తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి నెట్‌బాల్ క్రీడాపోటీల్లో నేత్ర విజయం గెలవడంతో మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై ందని వివరించారు. ఈ సందర్భంగా నేత్రను పీడీతో పాటు హెచ్‌ఎం విజయభారతి, ఉపాధ్యాయులు అభినందించారు.
ఫారెస్ట్ అక్రమాలపై
‘విజిలెన్స్’ విచారణ
కళ్యాణదుర్గం: అటవీ శాఖ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు స్పందించారు. మంగళగిరి విజిలెన్స్ డీఎఫ్‌ఓ ధర్మ రక్షిత్ బుధవారం కళ్యాణదుర్గం ఫారెస్ట్ కార్యాలయానికి చేరుకుని పలు రికార్డులను తనిఖీ చేపట్టారు. శాఖ తరఫున చేయించిన పనులకు సంబంధించిన బిల్లులను ఫోర్జరీ సంతకాల ద్వారా రూ.లక్షల్లో స్వాహా చేశారు. 2018లో నగరవనం పనుల కోసం మంజూరైన రూ.80 లక్షల నిధులు పక్కదారి పట్టాయి. ఇదివరకు నిర్వహించిన ఆడిట్ సమయంలో అక్రమాలు బయటపడ్డాయి. దీనితో పాటు బొగ్గుల బట్టీ ఏర్పాటుకు అనుమతి విషయంలో రూ.10వేల నుంచి రూ.15వేలు మామూళ్లు వసూలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా విచారణకు వచ్చారు. గతంలో పనిచేసిన రేంజ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్ అక్రమాలపై కూపీ లాగారు. క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు, రికార్డుల్లో చూపిన లెక్కలకు ఏమాత్రమూ పొంతనలేదని విచారణలో తేలింది. విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డీఎఫ్‌ఓ ధర్మరక్షిత్ తెలిపారు.
గోప్యత వెనుక మతలబేమిటో?
కళ్యాణదుర్గం ఫారెస్ట్ శాఖలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నప్పటికీ స్థానిక ఫారెస్ట్ అధికారులు ఈ విచారణ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమార్కులను కాపాడే ప్రయత్నం జరుగుతోందా..? లేక అవినీతి ఊబిలో మరికొందరు అధికారుల హస్తం కూడా ఉందా..? అన్న చర్చ జరుగుతోంది.
విదేశీ పర్యటనకు జేసీ
అనంతపురం అర్బన్: జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వ్యక్తిగత పనులపై డిసెంబరు 12న థాయిలాండ్ వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి 12, 13వ తేదీలు సెలవు దినాలు మినహాయించి డిసెంబర్ 14 నుంచి 22వ తేదీ వరకు తొమ్మిది రోజులు ఈఎల్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి జీఓ 2166ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం జారీ చేశారు. జేసీ సెలవులో ఉన్నన్ని రోజులు ఇన్‌చార్జ్ బాధ్యతలను వేరొకరికి అప్పగించేందుకు అవసరమైన చర్యలను కలెక్టర్ తీసుకోవాలని జీఓలో పేర్కొన్నారు.


