తొలివిడతలో 774 నామినేషన్ల తిరస్కరణ | - | Sakshi
Sakshi News home page

తొలివిడతలో 774 నామినేషన్ల తిరస్కరణ

Nov 19 2026 2:43 AM | Updated on Nov 19 2026 2:43 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. 13 మండలాల్లో మొత్తం 218 సర్పంచ్‌, 2,318 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు సంబంధించి సర్పంచ్‌ పదవులకు 1,822, వార్డు సభ్యుల స్థానాలకు 4,986 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం నిర్వహించిన పరిశీలనలో సర్పంచ్‌ స్థానాలకు 1,268, వార్డు స్థానాలకు 4,766 నామినేషన్లు అర్హత సాధించినట్లు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు ధ్రువీకరించారు. దాఖలైన నామినేషన్లలో సర్పంచ్‌ స్థానాలకు సంబంధించి 554, వార్డు స్థానాలకు సంబంధించి 220 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తంగా 774 నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురికావడం గమనార్హం. అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రావడంతో ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు.

అప్పీళ్లకు గురువారం అవకాశం..

శుక్రవారం పరిష్కారం

నామినేషన్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన అభ్యర్థులకు గురువారం రెవెన్యూ డివిజనల్‌ అధికారి వద్ద అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను అప్పిలేట్‌ అధికారికి సమర్పించవచ్చు. అందిన అప్పీళ్లను శుక్రవారం పరిష్కరించనున్నారు. అనంతరం నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఆసక్తి నెలకొంది.

రెండో విడతకు తొలిరోజు 381 నామినేషన్లు

మరోవైపు రెండో విడత ఎన్నికలు జరిగే తొమ్మిది మండలాల్లో బుధవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విడతలో 186 సర్పంచ్‌ స్థానాలకు, 1,794 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు రోజులపాటు సాగే నామినేషన్ల ప్రక్రియ తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. సర్పంచ్‌ స్థానాలకు 194, వార్డు స్థానాలకు 187 కలిపి మొత్తం 381 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా పరిశీలిస్తే బుక్కరాయసముద్రంలో సర్పంచ్‌ స్థానాలకు 13, వార్డులకు 6, గార్లదిన్నెలో సర్పంచ్‌ స్థానాలకు 4, వార్డు స్థానాలకు 4, నార్పలలో సర్పంచ్‌ స్థానాలకు 3, వార్డు స్థానాలకు 6, పుట్లూరులో సర్పంచ్‌ స్థానాలకు 20, వార్డు స్థానాలకు 34, శింగనమలలో సర్పంచ్‌ స్థానాలకు 9, వార్డు స్థానాలకు 2, యల్లనూరులో సర్పంచ్‌ స్థానాలకు 19, వార్డు స్థానాలకు 72, గుత్తిలో సర్పంచ్‌ స్థానాలకు 55, వార్డు స్థానాలకు 26, గుంతకల్లులో సర్పంచ్‌ స్థానాలకు 43, వార్డు స్థానాలకు 16, పామిడిలో సర్పంచ్‌ స్థానాలకు 28, వార్డు స్థానాలకు 21 నామినేషన్లు దాఖలయ్యాయి.

నేటి అప్పీళ్లపై ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement