కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని అల్లుళ్ల పెత్తనం అంతకంతకూ శృతిమించిపోతోంది. ఏకంగా సొంత పార్టీ నేతలతో పాటు ప్రజలు విసిగెత్తిపోయే స్థాయిలో వారి ఆగడాలు కొనసాగుతున్నాయి. పార్టీ వ్యవహారాలే కాదు అన్నింటిలోనూ తలదూరుస్తుండటం చర్చనీయాంశమైంది. | - | Sakshi
Sakshi News home page

కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని అల్లుళ్ల పెత్తనం అంతకంతకూ శృతిమించిపోతోంది. ఏకంగా సొంత పార్టీ నేతలతో పాటు ప్రజలు విసిగెత్తిపోయే స్థాయిలో వారి ఆగడాలు కొనసాగుతున్నాయి. పార్టీ వ్యవహారాలే కాదు అన్నింటిలోనూ తలదూరుస్తుండటం చర్చనీయాంశమైంది.

Nov 17 2026 1:26 AM | Updated on Nov 17 2026 1:26 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన అల్లుళ్ల వ్యవహారశైలి నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఎవరు? అధికారం ఎవరి చేతుల్లో ఉంది? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అల్లుళ్ల మితిమీరిన రాజకీయ జోక్యం, ఆధిపత్య ధోరణితో సొంత పార్టీ కేడర్‌తో పాటు పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.

మాట వినకుంటే బదిలీ

నియోజకవర్గంలోని అధికారులపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యుల పెత్తనం శృతిమించిపోతోందన్న విమర్శలున్నాయి. తాము చెప్పినట్టు నడుచుకోని అధికారులకు బదిలీని బహుమానంగా ఇస్తున్నారంటున్నారు. ఇందుకు నిదర్శనమే కంబదూరు ఎస్‌ఐ లోకేష్‌ బదిలీ. స్థానిక నేతల అక్రమ ఆదేశాలకు తలొగ్గలేదన్న కారణంతోనే కంబదూరు ఎస్‌ఐ లోకేష్‌ను రాత్రికి రాత్రే బదిలీ చేస్తూ వీఆర్‌కు పంపారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇదే తరహాలో కుందుర్పి ఎస్‌ఐ పైనా ఎమ్మెల్యే అల్లుడు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చేసిన దౌర్జన్యాలపై ఓ వైఎస్సార్‌సీపీ నాయకుడు నిలదీయడంతో సదరు నాయకుడిని స్టేషన్‌కు పిలిపించి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాలని ఎమ్మెల్యే అల్లుడు ఎస్‌ఐను ఆదేశించారట. అయితే ఎస్‌ఐ మాట వినకపోవడంతో బూతు పురాణం ఎత్తుకున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో వైఎస్సార్‌సీపీ నేత.. ఎమ్మెల్యే అల్లుడితో మాట్లాడిన ఆడియో వాట్సప్‌ గ్రూప్‌ల్లో వైరల్‌ కావడం చర్చనీయాంశమైంది. నిబంధనల ప్రకారం పనిచేస్తున్న పోలీసు అధికారులను ఇలా వేధిస్తుండటంపై పోలీసుశాఖలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రశ్నిస్తే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాలా..

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించడం సహజం. కానీ కళ్యాణదుర్గంలో మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను, స్థానిక నేతల అక్రమాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నేతలను స్టేషన్లకు పిలిపించి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాలంటూ కొందరు టీడీపీ నేతలు, ఎమ్మెల్యే వర్గీయులు పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులను తమ ప్రైవేట్‌ సైన్యంగా వాడుకోవాలని చూస్తున్న తీరును అందరూ ఖండిస్తున్నారు.

ప్రజల్లోనూ తీవ్ర అసహనం

ఎమ్మెల్యే అమిలినేని అల్లుళ్ల పెత్తనంతో విసిగిపోయిన సీనియర్‌ టీడీపీ నేతలు సైతం లోలోపల రగిలిపోతున్నారని తెలిసింది. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన తమను పక్కనపెట్టి కుటుంబ సభ్యుల ఆధిపత్యం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారట. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎమ్మెల్యే అమిలినేని అల్లుళ్ల అతి ఉత్సాహం, అధికారుల బదిలీలు, ప్రతిపక్షాలపై దాడుల ఒత్తిళ్లు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి.

కళ్యాణదుర్గంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ హాలులోకి తన అనుచరులతో వెళ్తున్న ఎమ్మెల్యే అల్లుడు ధర్మతేజ (ఫైల్‌)

ఇటీవల కళ్యాణదుర్గంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో ఎమ్మెల్యే అమిలినేని అల్లుడు దేవినేని అవినాష్‌, అతని అనుచరులను కౌంటింగ్‌ హాలులోకి పంపుతున్న పట్టణ సీఐ హరినాథ్‌ (ఫైల్‌)

కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని అల్లుళ్ల పెత్తనం

మాట వినని అధికారులపై బదిలీ వేటు

రాత్రికి రాత్రే వీఆర్‌కు కంబదూరు ఎస్‌ఐ లోకేష్‌

కుందుర్పి ఎస్‌ఐపైనా ఎమ్మెల్యే అల్లుడు గుర్రు

ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నేతలపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాలని ఒత్తిళ్లు

వారి తీరుపై సొంత పార్టీ నేతలు, ప్రజల్లో అసహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement