రూ.25.6 లక్షలకు సర్పంచ్‌ పదవి | - | Sakshi
Sakshi News home page

రూ.25.6 లక్షలకు సర్పంచ్‌ పదవి

Nov 17 2026 1:26 AM | Updated on Nov 17 2026 1:26 AM

● నక్కలపల్లిలో కొనసాగిన సంప్రదాయం

● ఎవరు ఎక్కువ మొత్తం గ్రామానికి ఇస్తే వారే సర్పంచ్‌

బెళుగుప్ప: పంచాయతీ ఎన్నికల వేళ మండల పరిధిలోని నక్కలపల్లి వార్తల్లో నిలిచింది. ఎన్నికల ఖర్చు, వివాదాలు తావులేకుండా ఆ గ్రామం ఏకగ్రీవానికి మొగ్గుచూపుతోంది. అయితే గ్రామాభివృద్ధికి ఎవరకు ఎక్కువ మొత్తం డబ్బులిస్తే వారికే సర్పంచ్‌ అంటూ మెలికపెడుతోంది. గత ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరించింది. తాజాగా కూడా ఇదే ఒరవడి కొనసాగింది. నక్కలపల్లి సర్పంచ్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా, ఆదివారం రాత్రి సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే అభ్యర్థుఽల నుంచి పిలిపించి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధికి ఎవరు ఎంత చెల్లిస్తారో చీటీల్లో రాసి ఓ డబ్బాలో వేయాలని సూచించారు. దీంతో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్న 9 మంది అభ్యర్థులు గ్రామాభివృద్ధికి తాము చెల్లించబోయే మొత్తాన్ని ఓ చీటీలో రాసి డబ్బాలో వేశారు. ఆ తర్వాత వాటిని తెరిచి చూశారు. అత్యధికంగా సుదర్శనరెడ్డి అనే వ్యక్తి తన భార్య అఖిల పేరుతో రూ.25.6 లక్షలు ఇస్తానని రాసి ఉండటంతో గ్రామస్తులు ఆమోదించారు. గతంలో ఇదే తరహాలో జరిగిన చీటీల పద్ధతిలో రూ.21 లక్షలతో సర్పంచ్‌గా రామిరెడ్డి ఎన్నికయ్యారు. ఈసారి గత ఏడాది కన్నా రూ.2.6 లక్షలు అధికంగా రూ.25.6 లక్షలు చెల్లించి సుదర్శనరెడ్డి అనే వ్యక్తి తన భార్య అఖిల సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement