అంగన్‌వాడీ కేంద్రానికి తాళం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రానికి తాళం

Nov 11 2026 12:43 AM | Updated on Nov 11 2026 12:43 AM

● బిల్లులు రాలేదని

టీడీపీ నాయకుడి నిర్వాకం

ఆత్మకూరు: తాను చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లులు రాలేదని ఓ టీడీపీ నాయకుడు ఏకంగా అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేశాడు. ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు అధికార పార్టీ నాయకుడు చేసిన నిర్వాకంతో అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. వడ్డుపల్లి గ్రామంలో శ్రీకృష్ణ అనే టీడీపీ నాయకుడు 2017–18 సంవత్సరంలో రూ.7 లక్షల వ్యయంతో అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణం చేపట్టాడు. ఇందుకు గాను రూ.4.30 లక్షలు బిల్లులు రాగా.. ఇంకా రూ.2.70 లక్షలు పెండింగ్‌లో ఉంది. అలాగే చెక్‌డ్యాం నిర్మాణానికి సంబంధించి రూ.2.10 లక్షలు కూడా రావాల్సి ఉంది. తొమ్మిదేళ్లు అవుతున్నా తనకు బిల్లులు అందకపోవడంతో ఆగ్రహించిన టీడీపీ నేత మంగళవారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి సిబ్బందిని, పిల్లలను బయటకు పంపించి.. తలుపులకు తాళం వేశాడు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సీడీపీఓ సదరు టీడీపీ నేతకు ఫోన్‌ చేసి మాట్లాడారు. పెండింగ్‌ బిల్లుకు సంబంధించి లేఖ ఇస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలపగా.. అతను అందుకు ససేమిరా అన్నాడు. తాను లేఖ ఇవ్వనని, మీకు 30 రోజులు గడువు ఇస్తానని, ఆలోపు బిల్లు అందకపోతే మాత్రం అంగన్‌వాడీ కేంద్రానికి పూర్తిగా తాళం వేసి తీరుతానని స్పష్టం చేశాడు. అనంతరం 11 గంటలకు తాళం తీయడంతో సిబ్బంది, చిన్నారులు లోనికి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement