సెపక్‌తక్రా, ఖోఖో జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

సెపక్‌తక్రా, ఖోఖో జిల్లా జట్ల ఎంపిక

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

ఉరవకొండ: స్ధానిక ఎస్‌కె ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం ఏపీ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో సెపక్‌తక్రా, ఖోఖో క్రీడల్లో అండ్‌–14, అండ్‌–17, అండర్‌–19 బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు. పాఠశాల హెచ్‌ఎం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా పీఈటీ యూనియన్‌ అధ్యక్షుడు నాగరాజు, ఎంఈఓ ఈశ్వరప్ప, ఎస్‌ఎస్‌ఎ మీట్‌ ఏడీ సంజీవ్‌కుమార్‌, శ్రీసత్యసాయి జిల్లా సెపక్‌తక్రా కార్యదర్శి రాంబాబు, సీనియర్‌ పీడీ మారుతీప్రసాద్‌, జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన పీడీలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 700 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ మారుతీప్రసాద్‌ తెలిపారు.

సెల్ఫీ దిగితే ఓటు రద్దు

గుత్తి రూరల్‌: మునిసిపల్‌, ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో ఓటు ఎవరికి వేశారో కనిపించేలా పోలింగ్‌ బూత్‌లో ఫొటో తీయడం చట్టరీత్యానేరం. ఓటింగ్‌ కేంద్రంలో మొబైల్‌ వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లో సెల్ఫీలు దిగితే ఓటును రద్దు చేయడమే కాకుండా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఫలానా వ్యక్తికి ఓటు వేశానని బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే ఆ ఓటును 17–ఏ ప్రకారం ప్రిసైడింగ్‌ అధికారి రద్దు చేసే అవకాశం ఉంది. ఓటు వేస్తూ సెల్ఫీలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే అలాంటి ఓటును పరిగణలోకి తీసుకోమని అధికారులు అంటున్నారు.

ప్రజలు నిలదీయడంతో దిగొచ్చిన బాబు ప్రభుత్వం

● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు

కూడేరు: సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికులు శుక్రవారం సమ్మె విరమించి విఽధుల్లోకి చేరారు. కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్‌ డ్యాం వద్ద ఉన్న సత్యసాయి ప్రాజెక్ట్‌లో ప్రధాన పైపులైన్‌ మోటర్లు ఆన్‌ చేసి గ్రామాలకు తాగునీటి సరఫరాకు కార్మికులు చర్యలు చేపట్టారు. సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడు మధుసూదన్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 4 నెలల వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేపట్టారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ప్రజలు తాగునీటి సమస్యపై కూటమి నేతలను నిలదీయడంతో ప్రభుత్వం దిగి వచ్చి ప్రాజెక్ట్‌ బీఆర్‌ఓ అకౌంట్‌లోకి రూ.18 కోట్లు జమ చేసిందన్నారు. ఈ నగదు 6 నెలల వేతనాలకు మాత్రమే సరిపోతుందన్నారు. ప్రజల తాగునీటి అవసరాలను, కార్మికుల ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కార్మికులకు ప్రతి నెల 5న వేతనాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే మళ్లీ కార్మికులు సమ్మెబాట పడతారని హెచ్చరించారు.

ప్రచారంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తలుపుల మండలంలోని ఈదులకుంట్లపల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దేవేంద్రనాయక్‌ ఈదులకుంట్లపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గోవిందునాయక్‌కు మద్దతుగా రాజనాలవాండ్లపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన కూడదని నిబంధనలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement