విదేశీయురాలిని అనర్హురాలిగా ప్రకటించండి | - | Sakshi
Sakshi News home page

విదేశీయురాలిని అనర్హురాలిగా ప్రకటించండి

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

కళ్యాణదుర్గం రూరల్‌: టీడీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి బుట్నా లక్ష్మిపై వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య గురువారం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. శ్రీలంక పౌరసత్వం ఉన్న బుట్నా లక్ష్మిని పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించాలని, ఆమె అభ్యర్థిత్వానికి సంబంధించిన అర్హతలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశీ మహిళకు రాజ్యాంగబద్ధంగా ప్రజలను పాలించే హక్కు లేదని పేర్కొన్నారు. టీడీపీ సోషల్‌ మీడియాలోనే ఆమె విదేశీ మహిళ అని ప్రచారం చేసుకుంటున్నారని ఆధారాలు చూపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement