మాయమాటలతో ప్రజల్ని మభ్యపెట్టలేరు | - | Sakshi
Sakshi News home page

మాయమాటలతో ప్రజల్ని మభ్యపెట్టలేరు

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం: ‘నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి నేతలకు ఓటమి భయం పట్టుకుంది. వారు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలను మభ్యపెట్టలేరు’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. బుధవారం నగరంలోని 44, 42, 43, 40, 41 తదితర డివిజన్లలో వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డ్డితో కలిసి ఆయా డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థులు నిహార్‌రెడ్డి, లోకనాథ్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, లీలావతి, హేమావతి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి పాలనా వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్‌, పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీన్ని గ్రహించే కూటమి పార్టీల నేతలు ఎలాగైనా గెలవాలని కుయుక్తులు పన్నుతున్నారని తెలిపారు. మేయర్‌ స్థానంతో పాటు 62 డివిజన్ల కార్పొరేటర్‌ స్థానాలకు నవంబర్‌ ఒకటో తేదీన పోలింగ్‌ జరగనుందని, ఈ క్రమంలో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో కూటమిలోని టీడీపీ–బీజేపీ–జనసేన నేతలు ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. నగరంలో రెండున్నరేళ్లుగా దోపిడీ రాజ్యం కొనసాగుతోందని చెప్పారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు భక్షకులుగా మారిపోయారని మండిపడ్డారు. ఇప్పుడు వారి మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పోలింగ్‌ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కలెక్టర్‌, ఎస్పీలే ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. మెరుగైన నగర పాలన వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని అన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. గెలిస్తే మౌలిక సదుపాయాలు కల్పించి, మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement