ఓటమి భయంతోనే మంత్రి కేశవ్‌ అధికార దుర్వినియోగం | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే మంత్రి కేశవ్‌ అధికార దుర్వినియోగం

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

● సమావేశంలో వై.ప్రణయ్‌రెడ్డి ధ్వజం

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి గెలిచే ధైర్యం లేకనే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాయలసీమ జోనల్‌ అధ్యక్షుడు ప్రణయ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కిడ్నాప్‌ చేయించారని ఆరోపించారు. మంత్రి కేశవ్‌ తన సొంత గ్రామమైన కౌకుంట్లలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పక్కన బెట్టి, తమ పార్టీ అభ్యర్థులను పోలీసుల సహాయంతో కిడ్నాప్‌ చేయించారని మండిపడ్డారు.

అభివృద్ధి చేసింటే నామినేషన్లను

ఎందుకు అడ్డుకున్నారు

ఉరవకొండ నియోజకవర్గంలో మంత్రి పయ్యావుల అభివృద్ధి పనులు చేసి ఉంటే, ఎన్నికలను పారదర్శకంగా ఎదుర్కోవడానికి భయమెందుకని ప్రణయ్‌ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయకుండా రాళ్లదాడి, బెదిరింపులు, పోలీసుల వేధింపులు, ముందస్తు అరెస్టులకు పాల్పడాల్సిన అవసరం మంత్రికి ఏమొచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని ప్రణయ్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతిపక్షాలకు నామినేషన్‌ వేసే హక్కు లేకుండా చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement