రాజకీయం ఎలా ఉంది?! | - | Sakshi
Sakshi News home page

రాజకీయం ఎలా ఉంది?!

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

గుమ్మఘట్ట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా రచ్చబండలపై ఇవే ముచ్చట్లు. ఏ నలుగురు కలిసినా రాజకీయంపైనే మాట్లాడుతున్నారు. ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి.. ఏ అంశాలు కీలకం కానున్నాయి.. అంటూ చర్చోప చర్చలు చేస్తున్నారు. గుమ్మఘట్ట మండలంలో ఓ గ్రామంలో జరిగిన రాజకీయ సంభాషణ ‘సాక్షి’ పాఠకుల ముందుకు తెస్తున్నాం.

మల్లి: ఏం రామన్నా.. యాడికి పోతున్నావ్‌. ఈ మధ్యన కనబడడంలేదు.

రామన్న: ఏం లేదప్ప.. పొద్దున్న తోట్లోకి పోయినోన్ని.. సాయంత్రం ఇంటికి వస్తాను.

మల్లి: తోట్లో ఎం వేసినావు?

రామన్న: రెండు ఎకరాల్లో మొక్కజొన్న, ఎకరా మిరప, ఎకరా టమేట వేశానప్ప.

మల్లి: అంతేనా.. అయితే పంటలు ఎట్లా వుండాయప్ప.

రామన్న: పంటలు ఫర్వాలేదు. చేతికి వచ్చినప్పుడు కదప్పా.

మల్లి: అదికూడా కరెక్టేలే. నమ్మాల్సిన మాటేకదా..

రామన్న: ఆ మిరపచెట్లకి ఆకుముడత రోగం పడింది. దానికి ఎన్ని మందులు కొట్టినా పోవడం లేదు.

మల్లి: ఏం చేయాలో తెలీదు.

మల్లి: మరి.. ఈసారి రాజకీయం ఎలా ఉంటుందంటావ్‌ రామన్న?

రామన్న: ఈసారి యా పార్టీకి ఓటేయల్ల మల్లి..

మల్లి: చూడల్ల..

రామన్న: ఏడిది చూడల్ల..? కొత్త ఇల్లు కట్టుకుందామని చూస్తే ఈ గౌర్మెంట్‌ వచ్చినవుటి నుండి కొత్త ఇండ్లు ఇడిలేదు.

మల్లి: నేను నీకు వైఎస్‌ జగన్‌ గౌర్మెంట్లోనే చెబితి. కొత్త ఇల్లు కట్టుకో అని చిలుకకు చెబినట్ల చెబితి. నువ్వే వినలేదు. ఆ గౌర్మెంట్లో కొత్త ఇండ్లు బాగిచ్చిరి. రెండేళ్ల నుండి నేను మా అమ్మకి ముసలోళ్ల ఫించెన్‌ చేబిద్దామంటే కొత్త ఫించెన్‌లు ఈలేదు. జగన్‌ గౌర్మెంట్లో ఆరు నెలలకోసారి కొత్త ఫించన్లు ఇచ్య. ఈ గౌరమెంట్లోన ఏదీ లేదు.

రామన్న: జగన్‌ గౌరమెంట్లోన పంటల ఇన్సూరెన్స్‌ డబ్బు జగనే కట్టేశా. రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 పడుతుండ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం తరఫున మోదీ 6 వేలు వేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం తరఫున 5 వేలు వేస్తున్నాడు. మిగిలిన 9 వేల రూపాయలు ఎగ్గొట్టారు. ఈ చంద్రబాబు గౌరమెంట్లోన రైతులే ఇన్సూరెన్స్‌ డబ్బులు కట్టిరి. అంతే కాదు యూరియా దొరక్క పంటలు దెబ్బతింటున్నాయి.

మల్లి: ఆర్‌బీకేల్లో అప్పడు యూరియా ఎంత కావాలంటే అంత ఇస్తుండిరి.ఈ గౌరమెంట్లోన ఎన్ని అవస్థలు పెట్టిరప్పా.

(అంతలోనే వారి మధ్యలోకి ఓ యువకుడు వచ్చాడు.)

శివ: ఏం మల్లి అన్న రాజకీయం గురించి జోరుగా మాట్లాడుతున్నారు.

రామన్న: ఏమీ లేదు శివ. యా గౌరమెంట్లోన ఎట్లుండ అనేది మాట్లాడుతున్నాం అంతే.

శివ: ఈ గవర్నమెంట్‌లో వలంటీర్‌ ఉద్యోగం వస్తుంది అనుకుంటి. వలంటీర్‌కు నెలకు రూ.10 వేలు ఇస్తామని చెప్పడంతో చంద్రబాబును నమ్మి ఓట్లు వేస్తిమి. అధికారంలో వచ్చాక చంద్రబాబు, పవన్‌ పంగనామాలు పెట్టిరి. అధికారంలోకి వచ్చాక దానిపై మాట్లాడడం లేదు. నాలాంటి నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి దానికీ మోసం చేసిరి.

(ఇంతలోనే అటుగా వెళుతున్న పార్వతి వారితో మాట కలిపింది.)

పార్వతి: ఏం రామ్‌ మామా..బాగుండావా!

రామన్న: బాగున్నాను పార్వతి. అవును పార్వతి ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోవు కదా! ఈసారి యా పార్టీకి ఓటేస్తావు?

పార్వతి : డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేసినోళ్లకి.

మల్లి: కరెక్టుగా చెప్పక్క..

పార్వతి: అన్యాయం అనకూడదు. కండ్లుపోతాయి. జగన్‌ గౌరమెంటు వుండింటే యాడాదికి 18 వేలు వస్తాండ. అవి పాయా. ఈయప్ప.. తెల్లగడ్డమాయప్ప ఆడబిడ్లకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పిండ. అధికారంలోకి వచ్చి మహిళలందరినీ మోసం చేశ. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్‌లు ప్రీగా ఇస్తామని చెప్పా.. ఇవ్వలేదు. మేము ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీకి ఓటేస్తా రామ్‌ మామా.. నేను మిరప కూలి పనులకు పోవల్ల.. ఉంటాను.

రామన్న: మేము కూడా అంతేలే. నేను తోట్లోకి నీళ్లు కట్టేకి పోతాను.. ఉంటాను మల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement