ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకై కదిలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకై కదిలి

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

● నార్పల వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా బూసుపల్లి శివానందరెడ్డి

నార్పల : ఉన్నత చదువులు చదివి, బెంగళూరులో ఫైనాన్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూ స్ధిరమైన జీవితాన్ని గడుపుతున్న ఓ యువకుడు .. తన వృత్తిని పక్కన పెట్టి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై నమ్మకంతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 35 ఏళ్ల యువకుడు బూసుపల్లి శివానందరెడ్డి రాజకీయాల వైపు అడుగులు వేశారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉద్దేశంతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

కుటుంబ నేపథ్యం...

నార్పల మండంలం కురగానిపల్లికి చెందిన బి. సరస్వతి, బి.రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమారులు, వీరిలో పెద్ద కుమరుడు శివానందరెడ్డి. కొన్నేళ్ల క్రితం శివానందరెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి మరణించాడు. శివానందరెడ్డి ఎంబీఏ, సీఏ పూర్తి చేసి బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో ఫైనాన్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.

జగన్‌ పాలనపై నమ్మకం... ప్రజాసేవపై ఆసక్తి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ,పేద కుటుంబాలకు అందించిన ఆర్థిక సాయం తనను రాజకీయాల వైపు ఆకర్షించాయని శివానందరెడ్డి చెబుతున్నారు. రాజకీయం కేవలం పదవుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేసే వేదికగా చూడాలనే ఆలోచనతో ముందుకొచ్చినట్లు పేర్కొంటున్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement