ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండండి

Oct 25 2026 6:40 AM | Updated on Oct 25 2026 6:40 AM

అనంతపురం న్యూ టౌన్‌: ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పాత ఆర్‌డీఓ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఈవీఎం గోదాములను శనివారం కలెక్టర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాష్‌ కుమార్‌, డీఆర్‌ఓ మలోలతో కలిసి గోదామును తనిఖీ చేశారు. డోర్‌ లాక్‌ సీళ్ల స్థితిని పరిశీలించి ఈవీఎంల రక్షణ చర్యలు, భద్రతప్రమాణాలు ఈసీ మార్గదర్శకాల ప్రకారం అమలవుతున్నాయా అనే అంశాలపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు లాగ్‌ బుక్‌ను పరిశీలించారు. అలాగే సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ పనితీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా కొనసాగింపు, అగ్నిమాపక పరికరాల అందుబాటుపై ఆరా తీశారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆనంద్‌, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్‌ కనకరాజు సీనియర్‌ అసిస్టెంట్‌ శామ్యూల్‌ బెంజ్‌ మెన్‌ పాల్గొన్నారు.

అనారోగ్యంతో

ఉపాధ్యాయుడి మృతి

బొమ్మనహాళ్‌: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు కురుబ మల్లికార్జున (52) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లికార్జున బొమ్మనహాళ్‌, కురువల్లి పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. ప్రస్తుతం రాయదుర్గంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జనసేన ఇన్‌చార్జ్‌ మంజునాథ్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు మల్లికార్జున మృతదేహానికి పూలమాలలు వేసి నివాళ్పురించారు. మృతుడు మల్లికార్జునకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మహిళా కౌన్సిలర్‌ అభ్యర్థికి బెదిరింపులు

గుంతకల్లు: వైఎస్సార్‌సీపీ 23వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి డీ.జరీనా రీనాతోపాటు ఆమె భర్త విష్ణును ఆదే వార్డుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు బెదిరించారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ తరఫున కౌన్సిలర్‌ టికెట్‌ కేటాయించినప్పటి నుంచి టీడీపీ అభ్యర్థి భర్తతోపాటు ఆమె బంధువులు, సహచరులు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. నామినేషన్‌ వేసేటప్పుడు, బీ–ఫారం అందజేసే సమయంలో తమ పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నించినట్లు వాపోయారు. ఎన్నికల ప్రచారం చేయకూడాదని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారన్నారు. తమకు మద్దతుగా వచ్చే స్నేహితులను కూడా బెదిరిస్తున్నారన్నారు. దీనిపై ఈ నెల 21న ఎస్‌ఈసీకి ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు పంపినట్లు తెలిపారు. తమకు ప్రాణాభయం ఉందని, తక్షణమే పోలీసులు రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement