రాష్ట్రంలో నియంత పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నియంత పాలన

Oct 25 2026 6:40 AM | Updated on Oct 25 2026 6:40 AM

● ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి ధ్వజం

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చంద్రబాబు ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ప్రవర్తించాలో తెలియదా అని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. విపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, దాడులు చేయడం, పత్రాలను బలవంతంగా లాక్కుని చింపివేయడమే టీడీపీ విధానమా అని నిలదీశారు. గుత్తి, గుంతకల్లు తదితర నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. గోరంట్లలో మంత్రి అనుచరులు సాక్షాత్తూ ఎన్నికల అధికారి చేతిలో నుంచే నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేసినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గుంతకల్లు నామినేషన్‌ కేంద్రాల వద్ద రౌడీలు, గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

పోలీసు, అధికార యంత్రాంగం వైఫల్యం

టీడీపీ గూండాలు బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు, పచ్చచొక్కాలు వేసుకున్నట్లుగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరా రామకృష్ణారెడ్డి, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ సోమర జయచంద్రనాయుడు, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ రమణ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement