● ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం
ఉరవకొండ: మండలంలోని చిన్నముష్టూరు సమీపంలో 42వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొనడంతో మహేశ్వరమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. ఉరవకొండ నుంచి చిన్నముష్టూరుకు మహేశ్వరమ్మ ద్విచక్ర వాహనంపై తన బంధువుతో కలిసి వెళ్తుండగా..అనంతపురం నుంచి బళ్లారి వెళ్తున్న కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొనింది. దీంతో మహేశ్వరమ్మ రెండు కాళ్లపైన టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.ఆమెను 108 వాహనం లో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అత్యవసర చికిత్స కోసం అనంతపురానికి తరలించారు.
చిన్నముష్టూరు గ్రామస్తుల రాస్తారోకో...
జాతీయ రహదారిపై వేగంగా వాహనాలు వెళ్తుండడంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చిన్నముష్టూరు గ్రామస్తులు 42వ జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకో చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ భయం భయంగా రోడ్డు దాటాల్సి వస్తోందని, గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అన్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైవేపై ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి, రాస్తారోకో విరమింపజేశారు.


