ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

● కరస్పాండెంట్‌ ఆలూరు సాంబశివారెడ్డి

బుక్కరాయసముద్రం: ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉందని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ ఆలూరు సాంబశివారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్‌) ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రభవ – 2026 పేరుతో ఫ్రెషర్స్‌డే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల కరస్పాండెంట్‌ ఆలూరి సాంబశివారెడ్డి హాజరయ్యారు. ముందుగా కళాశాలలో జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఎంచుకున్న రంగాల్లో రాణించవచ్చన్నారు. నాలుగేళ్లు కష్టపడితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థి కళాశాల యాజమాన్యం, సిబ్బంది అందించే అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బాలక్రిష్ణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రలు పెట్టుకున్న కలలను నిజం చేయాలన్నారు. ఆలూరు సాంబశివారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం అభినందనీయమన్నారు. టీపీఓ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమపై నమ్మకంతో పిల్లలను తమ కళాశాలలో చేర్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement