ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తల నోట వినిపించే మాట బైండోవర్. పాత నేరస్తులు, రౌడీషీటర్లతో పాటు ఒక వ్యక్తితో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, ఆయన చర్యలు అనుమానాస్పదంగా ఉన్నా.. ఆ వ్యక్తిని పోలీసులు తహసీల్దార్ లేదా ఆర్డీఓ ఎదుట హాజరుపరుస్తారు. ఆ వ్యక్తితో చట్టవ్యతిరేక చర్యలు, కార్యకలాపాల్లో పాల్గొనబోనని బాండ్ పేపర్‌పై లిఖిత పూర్వకంగా హామీ తీసుకొని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. బైండోవర్‌ను ‘బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్’ అని అంటారు. బైండోవర్ అయిన వ్యక్తి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అతన్ని 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు. – గుంతకల్లు టౌన్:


