జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక

Oct 14 2026 1:53 AM | Updated on Oct 14 2026 1:53 AM

● ముగ్గురికి పసిడి, ఇద్దరికి కాంస్య పతకాలు

అనంతపురం: పల్నాడు జిల్లా కారంపూడి మండలం బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన ’స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్రస్థాయి అండర్‌–14, అండర్‌–17 కుస్తీ (రెజ్లింగ్‌) పోటీల్లో అనంతపురం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వరుస విజయాలతో సత్తా చాటి జిల్లాకు ’ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌’ ద్వితీయ స్థానాన్ని తెచ్చిపెట్టారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి పతకాలు సాధించిన ఈ క్రీడాకారులు ఈనెల 31 నుంచి నవంబర్‌ 5 వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

క్రీడాకారులకు అభినందనలు

రాష్ట్రస్థాయిలో సత్తా చాటి జాతీయ పోటీలకు ఎంపికై న విజేతలను జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి సత్యనారాయణ, రాధమ్మ, జిల్లా కుస్తీ కోచ్‌ రాఘవేంద్ర, సుధాకర్‌ అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

పతకాల పంట :

అండర్‌–14 విభాగంలో.. : దాసరి లావణ్య (–42 కేజీల విభాగం) బంగారు పతకం (జెడ్పీహెచ్‌ఎస్‌ 5వ వార్డు, పామిడి)

● సామంతుల దేవ హర్షిని (–39 కేజీల విభాగం) – కాంస్య పతకం (ఏపీ మోడల్‌ స్కూల్‌, పామిడి)

అండర్‌–17 విభాగంలో: కొప్పల అనూష (–40 కేజీల విభాగం) – బంగారు పతకం (ఆదర్శ పాఠశాల, పామిడి)

● దాసరి యశస్విని (–46 కేజీల విభాగం)– బంగారు పతకం (జెడ్పీహెచ్‌ఎస్‌ 5వ వార్డు, పామిడి)

● గవ్వల చందన (–43 కేజీల విభాగం) – కాంస్య పతకం (టి.సి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పామిడి).

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో బాలికల ప్రతిభ

రాయదుర్గంటౌన్‌: కడపలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 రాష్ట్రస్థాయి బాలికల బాడ్మింటన్‌ పోటీల్లో అనంతపురం జిల్లా జట్టు ప్రతిభ చాటి మూడోస్థానాన్ని కై వసం చేసుకుంది. జిల్లా తరఫున ఎంపికై న ఐదుగురు బాలికల్లో పట్టణానికి చెందిన అశ్రితరేచల్‌ శాన్వి ఉన్నారు. వీరిలో కదిరికి చెందిన ముస్తాక్‌ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అశ్రిత రేచల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌, శాన్వి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు సాధించారు. ఈ విజయాల వెనుక రాయదుర్గం స్పోర్ట్స్‌ ఇండోర్‌ స్టేడియం నిర్వాహకుడు రాజేష్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ సుధాకర్‌ ఎంతో ఉందని బాలికల తల్లిదండ్రులు తెలిపారు.

నేడు, రేపు పెన్షన్‌, జీపీఎఫ్‌ అదాలత్‌

అనంతపురం అర్బన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి బుధ, గురువారాల్లో పెన్షన్‌, జీపీఎఫ్‌ ఆదాలత్‌ను కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించనున్నట్లు ఏపీ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఎస్‌.శాంతిప్రియ తెలిపారు. ఆర్‌బీపీఎస్‌ (రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ప్రాసెసింగ్‌ సిస్టం), పెన్షన్‌ కేసులు, జీపీఎఫ్‌ కేసులను ఆన్‌లైన్‌లో పెట్టడంపై డీడీఓలకు వర్క్‌షాపును బుధవారం నిర్వహిస్తామన్నారు. పెన్షనర్లకు సంబంధించిన అంశాలపై గురువారం సమావేశం నిర్వహించనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, డీడీఓలు, పీఎస్‌ఏలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement