కూలిన ఎలివేషన్‌ గోడ.. | - | Sakshi
Sakshi News home page

కూలిన ఎలివేషన్‌ గోడ..

Oct 9 2026 1:50 AM | Updated on Oct 9 2026 1:50 AM

గుంతకల్లుటౌన్‌:పట్టణంలోని విద్యానగర్‌ రోడ్డు –1లో ఉన్న మూడంతస్తుల పాత భవనం ఎలివేషన్‌ గోడ ఉన్నపళంగా కూలిపోయింది. అయితే కొన్నాళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం.. సరిగ్గా కొన్ని క్షణాల ముందు ఆ ఇంటిపక్కన దారి గుండా స్కూల్‌కు వెళ్లిన నలుగురు చిన్నా రులు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు భవన శిథిలాలను జేసీబీతో తొలగింపజేశారు.

17న రాష్ట్ర స్థాయి భజన పోటీలు

పెద్దపప్పూరు: చెర్లోపల్లిలో వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను పురస్కరించుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని భజన బృందాలకు పోటీలు నిర్వహించనున్నారు. ఈమేరకు నిర్వాహకులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. విజేత బృందాలకు 14 బహుమతులు అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న భజన బృందాలు సెల్‌: 9550056646, 7780299049, 7285989525, 9346898754లో పేర్లు నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు ఆ ప్రకటనలో తెలిపారు.

యూట్యూబర్లు,

‘పీడీఎఫ్‌’ విలేకరులపై కేసు

గుత్తి: పట్టణానికి చెందిన హ్యాండ్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నారాయణ స్వామిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.లక్షలు వసూలు చేసిన యూ ట్యూబర్లు, పీడీఎఫ్‌ పత్రిక విలేకరులు నలుగురిపై కేసులు నమోదయ్యాయి. గురువారం ఎస్‌ఐ అమీర్‌ఖాన్‌ తెలిపిన మేరకు.. హ్యాండ్స్‌ సంస్థ నారా యణ స్వామిని భరత్‌, షేక్షావలి, లక్ష్మీనారాయణ, సాయికృష్ణ బెదిరించి, డబ్బులు వసూ లు చేశారు. దీనిపై బాధితుడు స్థానిక పోలీసులకు ఆధారాలు సమర్పించారు. విచారణ అనంతరం నలుగురిపై 308(2), 351(2) రెడ్‌ విత్‌ 3(5) బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రైలు కింద పడి

యువకుడి ఆత్మహత్య

గుత్తి: జీఆర్‌పీ పరిధిలోని గుంతకల్లు రోడ్డు బ్రిడ్జి సమీపంలో గురువారం మహమ్మద్‌ అల్తాఫ్‌ (35) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని బండగేరికి చెందిన మహమ్మద్‌ అల్తాఫ్‌ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఇటీవల అతని సోదరుడు మృతి చెందాడు. ఒంటరితనాన్ని భరించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలా న్ని జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు పరిశీలించారు.

తప్పిన పెనుప్రమాదం

కళ్యాణదుర్గం (కంబదూరు): కంబదూరు మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్‌ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ గురువారం ఉదయం పెద్ద శబ్దంతో పేలిపోయింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో సమీపంలో ఉన్న కరెంటు స్తంభం నుంచి మంటలు ఎగసి పడ్డాయి. దీంతో ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. దీంతో విద్యుత్‌ తీగలు రోడ్డుపై పడ్డాయి. అయితే ఆ సమయంలో జనం రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

రెకమెండేషన్‌ ఉంటేనే

పప్పుశనగ విత్తనం

విడపనకల్లు:చీకలగురికిలో పప్పుశనగ విత్తనం కోసం రైతులు గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక టీడీపీ నేతల రెకమెండేషన్‌ ఉంటేనే సబ్సిడీ పప్పుశనగ విత్తనం ఇస్తాం. లేకపోతే ఇవ్వమని ఆర్‌ఎస్‌కే సిబ్బంది కరాఖండిగా చెబుతున్నారని రైతులు వాపోయారు. సబ్సిడీ పప్పుశనగ విత్తనం పొందాలంటే టీడీపీ నేతల రెకమెండేషన్‌ ఉండాలనే నిబంధనలు ఏమైనా ప్రభుత్వం చెప్పిందా అని ఆర్‌ఎస్‌కె సిబ్బందిని ప్రశ్నిస్తున్నా.. అదంతా తమకు తెలియదని సమాధానమిస్తున్నారన్నారు. వెంటనే విత్తనం ఇవ్వాలని నిరసన తెలిపారు.

టీడీపీ నాయకుడి ఇంట్లో పప్పుశనగ : స్థానిక టీడీపీ నాయకుడు కంద్యాల నారాయణస్వామి ఇంట్లోనే దాదాపు 120 క్వింటాళ్ల వరకు సబ్సిడీ పప్పుశనగ విత్తనం స్టాకును భద్రపరిచారు. ఆయన తన ఇంట్లో స్టాకు దింపుకొని తమకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు ఈ విషయంపై ఏఓ పెన్నయ్యను అడగ్గా అర్హులందరికీ పప్పుశనగ ఇస్తామన్నారు.

హెచ్చెల్సీలో

గుర్తు తెలియని శవం లభ్యం

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే ఎగువ కాలువ (హెచ్చెల్సీ) లో గుర్తు తెలియని శవం గురువారం కొట్టుకు వచ్చింది. బొమ్మనహాళ్‌ సరిహద్దులోని హెచ్చెల్సీ కాలువ రెగ్యులేటర్‌ వద్ద మృతదేహ కాలువలో కొట్టుకుపోతూ కనిపించింది. ఉదయం సమయంలో కాలువలో నీటి మట్టం తగ్గడంతో శవం పక్కకు కొట్టుకువచ్చి కొద్దిసేపు ఒడ్డున ఆగింది. రైతులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని శవం పురుషుడిదని, 45 ఏళ్ల వయస్సు ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement