● మృతుడు ఓ హత్య కేసులో నిందితుడు
గుంతకల్లుటౌన్: వివాహ వయస్సు దాటుతున్నా పెళ్లి కాలేదన్న బెంగతో బోయ లక్ష్మీనారాయణ అలియాస్ సుధ (37) ఆత్మహత్య చేసు కున్నాడు. వన్‌టౌన్ సీఐ శ్రీధర్ తెలిపిన మేరకు.. పట్టణంలోని మోదినాబాద్ పైకొట్టాల సుంకులమ్మ గుడి వీధికి చెందిన లలితమ్మ, నాగన్నల రెండో కుమారుడు లక్ష్మీనారాయణ ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. వయసు మీరుతున్నా వివాహం కాలేదని బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు, మిత్రులతో చెప్పి బాధపడ్డాడు. గురువారం ఉదయం ఎంతసేపటికీ లక్ష్మీనారాయణ తలుపులు తీయకపోవడంతో బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా తాడుతో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మృతుడు..ఓ హత్య కేసులో నిందితుడు..
ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీనారాయణ అలియాస్ సుధ 2019 ఆగస్టులో గుంతకల్లు బెంచికొట్టాల వాటర్‌ప్లాంట్ వద్ద జరిగిన ఓ కుల సంఘం నాయకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడని సీఐ తెలిపారు. అప్పట్లో వన్‌టౌన్ పీఎస్‌లో అతడిపై నమోదైన కేసు ప్రస్తుతం విచారణ దశకు చేరుకుందని ఆయన తెలిపారు.


