25 మండలాల్లో వాన | - | Sakshi
Sakshi News home page

25 మండలాల్లో వాన

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాపై వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు 22 మండలాల పరిధిలో 7.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విడపనకల్లు 54.4 మి.మీ, వజ్రకరూరు 32.8, గార్లదిన్నె 20.8, కణేకల్లు 11, బొమ్మనహాళ్‌ 10.4, ఉరవకొండ 10.2 మి.మీ వర్షం కురిసింది. సెప్టెంబర్‌ సాధారణం 111.6 మి.మీ కాగా ప్రస్తుతానికి 76.3 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా జూన్‌ ఒకటి నుంచి 282 మి.మీ గానూ 30 శాతం తక్కువగా 198 మి.మీ నమోదు కావడం గమనార్హం.

నేడు పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం

అనంతపురం టౌన్‌: జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని గురువారం కలెక్టర్‌ అధ్యక్షతన రెవెన్యూ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. జిల్లాలోని పరిశ్రమల్లో వస్తు ఉత్పత్తి, ఎగుమతులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చిస్తారన్నారు.

రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటుకు పచ్చ జెండా

అనంతపురం టౌన్‌: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. పీపీపీ విధానంలో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌కు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశాలు జారీ చేశారు. 45 రోజుల్లో టెండర్ల పక్రియ పూర్తి చేయాలని సూచించారు. ముందుగా, జిల్లా కేంద్రాల్లో.. తర్వాత దశల వారిగా అన్ని ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. కాగా, రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటును డాక్యుమెంట్‌ రైటర్లు, వెండార్లు వ్యతిరేకించి ఇటీవల 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్‌ నిర్వహించారు. వీటితో డాక్యుమెంట్‌ రైటర్లు రోడ్డున పడే ప్రమాదం తలెత్తనుంది.

టూవీలర్‌ మెకానిజం కోర్సుపై ఉచిత శిక్షణ

అనంతపురం: ఏ.ఎఫ్‌.ఎకాలజీ సెంటర్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం 45 రోజుల ఉచిత టూ వీలర్‌ మెకానిజం (బైక్‌ రిపేరింగ్‌, సర్వీసింగ్‌, ఇంజిన్‌ రిపేరింగ్‌) శిక్షణ కోర్సు నిర్వహిస్తున్నట్లు ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ మలా రెడ్డి తెలిపారు. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తారన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత టూల్‌ కిట్‌, సర్టిఫికెట్‌తో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ నెల 24 నుంచి కొత్త బ్యాచ్‌ ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి గల వారు ఉప్పరపల్లి రోడ్డు, బెంగళూరు హైవే వద్ద ఉన్న అనంతపురం ఏ.ఎఫ్‌. ఎకాలజీ సెంటర్‌లో సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలను 99594 22884, 99487 71362 నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.

పీఎండీఎస్‌తో ఎల్‌నినోను అధిగమించొచ్చు

కూడేరు: పీఎండీఎస్‌ (ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌) విధానంతో ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని రాయలసీమ జిల్లాల ఎల్‌నినో క్లస్టర్‌ అధికారి ఎం.కె.వి. శ్రీనివాసులు అన్నారు. బుధవారం కూడేరు వద్ద రైతు శంకర నాయుడు పొలంలో చేపట్టిన పీఎండీఎస్‌ మిశ్రమ సాగు పద్ధతులు, హాఫ్‌మూన్‌ మోడల్‌ను పరిశీలించారు. రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రతి రైతు ఎల్‌నినో దృష్ట్యా పీఎండీఎస్‌ విధానంలో సాగు చేయాలని తెలియజేశారు. అనంతరం కంది, ఆముదం, ఉద్యాన పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సాల్‌ రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి ధనుంజయ్య, ఏపీడీ చంద్రశేఖర్‌, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement