మమ్మల్ని చంపి ఇసుక తరలించండి | - | Sakshi
Sakshi News home page

మమ్మల్ని చంపి ఇసుక తరలించండి

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

యల్లనూరు: ‘మమ్మల్ని చంపేసి ఇసుకను తరలించుకోండి’ అంటూ మండలంలోని మల్లాగుండ్ల గ్రామ ప్రజలు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. మల్లాగుండ్ల గ్రామ సమీపంలోని 58 ఎకరాల్లో 1,17,199 టన్నుల ఇసుకను తరలించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం బుధవారం అనంతపురం ఆర్డీఓ ప్రేమ్‌నాథ్‌ కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శశికళ, తాడిపత్రి మైనింగ్‌ ఏడీ ఓబుల్‌రెడ్డి, తహసీల్దారు సింధు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమానికి రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌, యువ నాయకుడు రిత్విక్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, యల్లనూరు జెడ్పీటీసీ భోగతి విజయపత్రాప్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు సాయిప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ గంగాదేవి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ శివశంకర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శైలజానాథ్‌ మాట్లాడుతూ యల్లనూరు, పుట్లూరు మండలాలు ఉద్యాన పంటలకు పెట్టింది పేరన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి ఇసుక తీసుకోకూడదన్నారు. అన్ని గ్రామాల రైతులు ఒకే మాట మీద నిలబడ్డారన్నారు. అసలే రైతుల పరిస్థితి బాగాలేదని, బోర్లలో నీరు తగ్గిపోయాయని, అయినా ఇసుక తవ్వకాలు ఎలా చేస్తారని అధికారులను నిలదీశారు. యల్లనూరు వద్ద చిత్రావతి నదిలో నిమజ్జనానికి కూడా నీరు లేక వినాయక విగ్రహాలను అలాగే వదిలేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇసుక రీచ్‌ వద్దే వద్దని ఏడు గ్రామాల రైతులు సంతకాలు చేసి ఆర్డీఓ ప్రేమనాథ్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మైనింగ్‌ అధికారి వరప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యూత్‌ జాయింట్‌ సెక్రటరీ వనం రవి, రాష్ట్ర రైతు విభాగం జాయింట్‌ సెక్రటరీ కల్లూరు సూరి, నాయకులు మల్లాగుండ్ల కొండారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, పురుషోత్తంనాయుడు, కిరణ్‌, దాసరి రమణ, ఏటూరు రామాంజినేయులు, నాగరంగయ్య, యల్లనూరు మారుతి, జాఫర్‌, హాజీవలి, చిన్న ఆంజనేయులు, గడ్డంవారిపల్లి రామాంజులరెడ్డి, రామకృష్ణారెడ్డి, లక్ష్మిరెడ్డి, కొడవండ్లపల్లి మణికంఠ, తిరుమలాపురం కృష్ణారెడ్డి, పాతపల్లి తిరుపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాభిప్రాయ సేకరణలో మల్లాగుండ్ల గ్రామస్తుల ధ్వజం

కరువు పరిస్థితులుంటే ఇసుక

తరలిస్తామంటారా?: మాజీ మంత్రి శైలజానాథ్‌ మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement