ఏడు రోజుల పాటు పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. యువత కేరింతలు, డీజేలు, బ్యాండు మేళాలు, డప్పు చప్పుళ్లు హోరెత్తాయి. పట్టణం నలువైపులా నుంచి దాదాపు 150 విగ్రహాలను ప్రధాన రహదారుల్లో ఊరేగించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవార్లూ గుడ్డం కోనేరు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.
– హిందూపురం టౌన్:


