ఉరవకొండ: రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వీరశైవ కల్యాణ మంటపంలో పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డితో పాటు నియోజకవర్గ పరిశీలకుడు గోవర్దన్‌రెడ్డి, గ్రేటర్ రాయలసీమ అధికార ప్రతినిధి రమణ, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న హాజరయ్యారు. పార్టీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు డిష్ సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో 60 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. ఖరీఫ్‌లో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయి 80 శాతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు. ఎల్‌నినో వస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరించినా చంద్రబాబు అప్రమత్తం కాకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రైతులకు ఈ దుస్థితి పట్టిందన్నారు. పంట పెట్టుబడులు తిరిగిరాక కుటుంబ పోషణ భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. గ్రామాల్లో పనులు లేక వ్యవసాయ కూలీలు వలసబాట పట్టారన్నారు. ఐదేళ్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఈక్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతులందరికి ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకొచ్చి, ఐదేళ్లలో ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 1.05 లక్షల మంది రైతులకు రూ.185 కోట్ల బీమా ప్రీమియం చెల్లించగా పరిహారం రూపంలో రూ.575 కోట్ల లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. పండ్ల తోటలు సాగుచేసే రైతులకూ రూ.లక్షలు బీమా వర్తించిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బీమా ప్రీమియం రైతులే చెల్లించేలా చేసి వారిని మరింత అవస్థలు పాలుచేశారన్నారు. ఇప్పటికైనా కరువు మండలాలు ప్రకటించి సహా యక చర్యలు చేపట్టాలన్నారు. హంద్రీ–నీవా వెడల్పు పనుల్లో రూ.కోట్లు దోపిడీ చేసిన అధికార పార్టీ నేతలు కనీసం నీటిని జిల్లా రైతులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.నియో జకవర్గ పరిశీలకుడు గోవర్దనరెడ్డి మాట్లాడుతూ మంత్రి పయ్యావుల కేశవ్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా మోసం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి కేవీ రమణ మాట్లాడుతూ పయ్యావుల సహా మంత్రులు హంద్రీ–నీవా పనుల్లో రూ.వెయ్యికోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్, ఎంపీపీలు నరసింహలు, దేవిబాయి, నారాయణరెడ్డి, కరణం పుష్పావతి, వైస్ ఎంపీపీలు ఈడిగ ప్రసాద్, దేవా, పార్టీ రాష్ట్ర నాయకులు బసవరాజు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ


