కళ్యాణదుర్గం రూరల్: కామక్కపల్లిలో శుక్రవారం రాత్రి దళితులపై ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు దాడి చేశారు. మారెమ్మ జాతర నేపథ్యంలో గ్రామస్తులు శుక్రవారం ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. అందులో భాగంగా గ్రామంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి గేట్ వాల్వ్‌ను తమ కాలనీ వైపు తిప్పినందుకు దళిత సామాజిక వర్గానికి చెందిన తిమ్మరాజు, ఆంజనేయులు, శశికుమార్‌లపై అదే గ్రామానికి చెందిన అమిలినేని అనుచరులైన నాగేంద్ర, హనుమేష్, చిన్న, నాగభూషణ్ కులం పేరుతో దూషిస్తూ దాడిచేశారు. ఈ దాడిలో గాయపడ్డ తిమ్మరాజు, అంజినేయులు, శశికుమార్ కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను డీఎస్పీ రవిబాబు పరామర్శించి, గొడవకు గల కారణాలపై ఆరా తీశారు. దాడిచేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.


