● సీఎం కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆనంద్ ప్రజెంటేషన్
అనంతపురం అర్బన్: గ్రామీణ క్రీడాకారులకు ఉపకరించేలా జిల్లాలో స్కూల్ చాంపియన్ షిప్ అమలు చేశామని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అమరావతిలో జరిగిన సీఎం కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో క్రీడల చాంపియన్‌షిప్ నిర్వహించామన్నారు. పీ–4 విధానంలో క్రీడా ఉపకరణాలు, మెడల్స్ అందించే విధానాన్ని రూపొందించామన్నారు. స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పేరిట రూ.20 లక్షల వ్యయంతో క్రీడా పోటీలు నిర్వహించామని చెప్పారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి అక్కడి నుంచి జాతీయ స్థాయికి వెళ్లేలా క్రీడాకారుల్ని ప్రోత్సహించామన్నారు.


