వరి, మిర్చి సాగు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

వరి, మిర్చి సాగు చేయొద్దు

Sep 11 2026 10:04 AM | Updated on Sep 11 2026 10:04 AM

కణేకల్లు: హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ పరిధిలోని ఆయకట్టు భూముల్లో వరి, మిర్చి పంటలు ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయరాదని హెచ్చెల్సీ ఈఈ పార్థసారథి, డీఈఈ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ (189 కిలోమీటర్‌ నుంచి 144 కిలోమీటర్‌ వరకు)ను ఈఈ, డీఈఈలు గురువారం పరిశీలించారు. అనంతరం ఈఈ విలేకర్లతో మాట్లాడారు. హెచ్చెల్సీ, జీబీసీ కింద ఆరుతడి పంటలకే నీరిస్తున్నట్లు వెల్లడించారు. వరి, మిర్చి పంటలు సాగు చేసి నష్టపోవద్దన్నారు. సెప్టెంబర్‌ 16 నుంచి వారం రోజుల పాటు డిస్ట్రిబ్యూటరీలకు నీటి సరఫరా నిలిపేస్తామని, ఆ తర్వాత పునరుద్ధరిస్తామన్నారు. కర్ణాటక ప్రభుత్వం నవంబర్‌ 10లోపు నీటిని పూర్తిగా డ్రా చేసుకోవాలని నిర్ణయించిందని, తాము కూడా ఆ రాష్ట్రంతో సమానంగా నీరు డ్రా చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో జేఈ మారుతిప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి రైతూ ఈ–పంట నమోదు చేసుకోండి

శెట్టూరు: ప్రతి రైతు పంట నమోదును తప్పని సరిగా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని చిన్నంపల్లిలో ఆయన పర్యటించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షం లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. పంట పొలాల్లో తేమశాతం నిలుపుకోవడానికి జీవామృతం, యూరియా, పొటాషియం నైట్రేట్‌ ిపిచికారీ చేసుకోవాలన్నారు. వర్షాలు లేక బోరుబావులు సైతం ఎండిపోతున్నాయని, రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలైన ఉలవ, కొర్ర, సజ్జ, జొన్న వంటి పంటలు సాగు చేసుకోవాలన్నారు. పంట బీమా ఆధారంగానే మద్దతు ధర, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇతర ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను తప్పని సరిగా చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఎల్లప్ప, మండల వ్యవసాయ అధికారిణి వాసకిరాణి, ఏఓలు శ్రవన్‌కుమార్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి మహిళ ఆర్థిక

స్వావలంబన సాధించాలి

బుక్కరాయసముద్రం: సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎన్‌ఆర్‌ఎల్‌ఎం (నేషనల్‌ రూరల్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌) మేనేజర్‌ పంకజ్‌ సుయల్‌, ఎన్‌ఆర్‌పీ స్వామి నాథన్‌ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ఢిల్లీ బృందం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రతి మహిళ సంఘంలో చేరాలని, దీని ద్వారా కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. డీఆర్‌డీఏ ఏపీడీ రాధారాణి, సెర్ప్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ లక్ష్మి ప్రసాద్‌రెడ్డి, పీఈ శోభా, డీపీఎంయూ సత్య నారాయణ, ఏపీఎం అనితాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement