కార్మికుల జీతాల కోసం గతంలో అనేకసార్లు ఆందోళన చేపట్టాం. ఏదో ఒక సాకు చెప్పి మభ్యపెట్టడం ఆనవాయితీగా మారింది. అడపా వెంకట్రావు చరిత్ర మొత్తం మోసపూరితమే అని రెండు జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోమారు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల లోపాయికారి వ్యవహారంతో చెలరేగిపోతున్న అడప వెంకటరావు మోసకారితనంపై ఉద్యమిస్తాం. కార్మికుల బకాయిలను సాధించుకుంటాం.
–ఓబులు, శ్రీరామరెడ్డి వాటర్ సప్లై
స్కీం వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు
అవును.. చెక్కు జారీ చేశాం
శ్రీరామరెడ్డి వాటర్ ప్రాజెక్ట్ కార్మికుల వేతనాల చెల్లింపులకు సంబంధించి అడప వెంకటరావు పేరుతో చెక్కు జారీ చేసింది నిజమే. అతని అర్హతలకు సంబంధించి నాకు పెద్దగా తెలియదు. ఒప్పంద సంస్థ పేరుతో జారీ అయిన చెక్కును ఎందుకు రీకాల్ చేశారో నాకు తెలియదు. – జి.శ్రీనివాసులు,
ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్


