బక్కచిక్కిన జీవం..దిక్కుతోచని దైన్యం! | - | Sakshi
Sakshi News home page

బక్కచిక్కిన జీవం..దిక్కుతోచని దైన్యం!

Aug 24 2026 6:51 AM | Updated on Aug 24 2026 6:51 AM

వర్షాభావ పరిస్థితులతో పచ్చిక బయళ్లు కనిపించడం లేదు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు బోసిపోతున్నాయి. పంటల సాగు అంతంత మాత్రంగానే ఉండటంతో పశుగ్రాసం లభించడం గగనంగా మారింది. ఇదే క్రమంలో ప్రభుత్వం నుంచి కూడా ఆసరా కరువైంది. దీంతో దిక్కుతోచని రైతన్న మూగజీవాలను తెగనమ్ముకుంటున్నారు. అనంతపురంలోని మార్కెట్‌ యార్డులో ఆదివారం జరిగిన పశువుల సంతలో ఎక్కడ చూసినా బక్కచిక్కిన జీవాలు కనిపించడం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులకు అద్దం పట్టింది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement